రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవుతున్న తరుణంలో ఉక్రెయిన్ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై భారీ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్ తోసిపుచ్చింది.
తాజాగా పుతిన్ నివాసంపై దాడి చేసింది ఉక్రెయినే అని.. అందుకు సంబంధించిన ఆధారాలను అమెరికాకు రష్యా అందజేసింది. రష్యా సీనియర్ సైనికాధికారి.. గురువారం అమెరికా సైనిక అటాచ్‌కు అందజేశారు. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ దాడులు చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Karnataka: వెలుగులోకి కాంగ్రెస్ ఎన్నికల సర్వే.. రాహుల్‌గాంధీపై బీజేపీ విమర్శలు
