Site icon NTV Telugu

Ukraine Crisis : రష్యా అధ్యక్షుడు కీలక నిర్ణయం..

రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్‌ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్‌లో ఇతర దేశాలకు చెందిన పౌరులతో పాటు, ఉక్రెయిన్‌ పౌరులు కూడా తమ ప్రాణాలను గుప్పింట్లో పెట్టకొని గడుపుతున్నారు. అయితే నాటో దేశాలు దూకుడు ప్రదర్శిస్తుండడం, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థికాంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నాటో దేశాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పుతిన్ రష్యా అణ్వస్త్ర నిరోధక విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలుగా తెలుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా నాటో దేశాల ప్రకటనలు కఠినంగా ఉంటున్నాయి. ఉక్రెయిన్ పై సైనికచర్య నేపథ్యంలో, నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు.

Exit mobile version