NTV Telugu Site icon

Putin: రష్యా అధినేత బతికేది మరో మూడేళ్లే..!

Putin

Putin

ప్రపంచ అగ్రనేత, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇంకో మూడేళ్లే బతుకుతాడా..? ఇంటెలిజెన్స్ అధికారులు, గూడాచారులు రిపోర్ట్ ఆధారంగా మూడేళ్లకు మించి పుతిన్ బతకరని తెలుస్తోంది. తాజాగా పుతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ది ఇండిపెండెంట్’ ఒక నివేదికలో తెలియజేసింది. అతను మూడేళ్లు మించి జీవించి ఉండరని మాజీ రష్యా ఇంటెలిజెన్స్ అధికారి చెప్పినట్లు ఇండిపెండెంట్ ఒక కథనంలో తెలిపింది. పుతిన్ తీవ్రమైన కాన్సర్ తో బాధపడుతున్నట్లు దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడిచింది.

రష్యన్ ఫెడరల్ సెక్యూరటీ సర్వీస్ అధికారి చెప్పినదాని ప్రకారం 69 ఏళ్ల పుతిన్ క్రమంగా తన కంటిచూపును కోల్పోతున్నాడని నివేదిక వెల్లడించింది. యూకేలో నివసిస్తున్న మాజీ రష్యన్ గూడచారి బోరిస్ కార్పిచ్ కోవ్, పుతిన్ ఆరోగ్యం గురించి వెల్లడించారని ఇండిపెండెంట్ తన నివేదికలో పేర్కొంది. పుతిన్ తలనొప్పితో బాధపడుతున్నాడని.. తనకు కనిపించేలా అక్షరాలను చాలా పెద్దగా కాగితంలో రాసుకువచ్చి ప్రసంగిస్తున్నాడని.. అవి ఎంత పెద్దవి అంటే ఒక పేజీలో కేవలం రెండు వాఖ్యాలు మాత్రమే ఉంటున్నాయని, కంటి చూపు కోల్పోతున్నాడని నివేదిక పేర్కొంది.

పుతిన్ అవయవాలు కూడా అతని నియంత్రణలో లేవని.. తీవ్రంగా వణుకుతున్నాడని, ఇక పుతిన్ తన చికిత్సలో భాగంగా పొత్తి కడుపు నుంచి ద్రవాన్ని తొలగించుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వీటన్నింటిని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఖండించారు. బుద్ధి లేని వ్యక్తులే ఇటువంటి ప్రచారానికి పాల్పడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ లో 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్న పుతిన్.. ప్రతీ రోజు బహిరంగంగా కనిపిస్తారని ఆయన అన్నారు. రెండు దశాబ్ధాలుగా తిరుగులేని నేతగా పుతిన్ రష్యాను ఏలుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ దేశంపై యుద్ధం చేస్తున్నాడు.