NTV Telugu Site icon

Russia Crime: దారుణం.. యువతిని 14 ఏళ్లు బంధించి, 1000 సార్లకు పైగా అత్యాచారం

Russia 14 Years Crime

Russia 14 Years Crime

Russia Man Kidnapped Teen Girl And Kept As His Slave For 14 Years: రష్యాలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ రాక్షసుడు యువతికి మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించి.. ఆమెను బంధించి, 14 సంవత్సరాలపాటు చిత్రహింసలకు గురి చేశాడు. తన శృంగారానికి బానిసగా మార్చుకున్నాడు. 1000 సార్లకు పైగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై పైశాచికత్వం ప్రదర్శిస్తూ, నరకం చూపించాడు. చివరికి ఎలాగోలా ఆమె ఆ రాక్షసుడి చెర నుంచి బయటపడి పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో వ్లాదిమిర్ చెస్కిడోవ్(51) అనే వ్యక్తి 2009లో ఎకటరీనా అనే యువతిని కిడ్నాప్ చేశాడు. ఇంటికి ఆల్కహాల్ పార్టీకి పిలిచి.. ఆమెను బయటకు రాకుండా బెడ్రూంలో నిర్బంధించాడు. దాదాపు 1000కి పైగా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరిస్తూ, ఇంట్లో పనులు చేయించుకునేవాడు.

Aashika Bhatia: అవును.. నాకు ఆ ‘పాడు’ అలవాటు ఉంది.. అమ్మకి కూడా తెలుసు

ఆ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎకటరీనా ప్రయత్నించింది కానీ, ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆమె దీనస్థితిపై జాలి కలిగి.. వ్లాదిమిర్ తల్లి ఆమెను విడిపించడంలో సహాయం చేసింది. ఆమె సహకారంతో ఎకటరీనా ఆ నరకం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు. బయటకొచ్చిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి, జరిగిన ఉదంతాన్ని వివరించింది. తనని 14 ఏళ్లు బంధించి 1000 సార్లకు పైగా అత్యాచారం చేశాడని, కత్తితో బెదిరించి ఇంట్లో పనులు చేయించుకున్నాడని, చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా హింసించేవాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు.. తనను బందించిన ఇంటికే మరో మహిళని వ్లాదిమిర్ తీసుకొచ్చాడని, తనతో గొడవ పడిన కారణంగా ఆమెను 2011లో కత్తితో అనేకసార్లు పొడిచి కిరాతకంగా చంపాడని వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడు వ్లాదిమిర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Startup Layoffs: దయనీయమైన స్థితిలో స్టార్టప్‎లు.. 6 నెలల్లో 17 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

అలాగే.. నిందితుడు ఇంటికి వెళ్లి పరిశీలించగా అక్కడ పోలీసులకు బయంకరమైన వస్తువులు కనిపించాయి. సెక్స్ టాయ్స్, శృంగార వీడియోలతో ఆ ఇళ్లు మొత్తం నిండి ఉండటం చూసి వాళ్లు ఖంగుతిన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మానవ అవశేషాలు కూడా అక్కడ కనిపించాయి. దీంతో.. అతనిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్ ఆరోపణలపై కేసు నమోదు చేశాడు. వ్లాదిమిర్ మానసిక రుగ్మతతో బాధపడుతుండటంతో.. పోలీసుల సమక్షంలో ఒక మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Show comments