Site icon NTV Telugu

Russia-Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరుపుతున్న రష్యా..

Russia

Russia

Russia-Ukraine War: గత ఏడాదిన్నరగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే రష్యా, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహింస్తోంది. డోనెట్స్క్, లూహాన్స్క్, ఖేర్సన్, జపొరిజ్జియా ప్రాంతాల్లో రష్యా శుక్రవారం ఎన్నికలను ప్రారంభించింది. ఆదివారంతో ఇవి ముగియనున్నాయి. ఇదిలా ఉంటే రష్యా చర్యను వెస్ట్రన్ దేశాలు ఖండిస్తున్నాయి.

Read Also: Bypolls Results 2023:ఘోసిలో ఇండియా కూటమి హవా.. త్రిపురలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ విజయం

ఏడాది క్రితం ఈ నాలుగు ప్రాంతాలను రష్యా చేజిక్కించుకుంది. ఈ ప్రాంతాలపై ఇరు దేశాలు యుద్దం చేస్తున్నాయి. రష్యా తన పట్టు నిలుపుకునేందుకు ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని యూరప్ హక్కలు సంస్థ ఆక్షేపిస్తోంది. రష్యా చర్యలు ఉక్రెయిన్ ప్రజలకు ముప్పు కలిగిస్తుందని ఆ దేశం ప్రకటనలో చెప్పింది. ఈ ఎన్నికల ఫలితాలను గుర్తించవద్దని ఇతర దేశాలను కోరింది.

కాగా రష్యాకు ఈ ప్రాంతాలపై పూర్తి పట్టు లేకపోయినప్పటికీ ఓటింగ్ ద్వారా భ్రమను కల్పించాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ, జాతీయవాద లిబరల్ డెమోక్రాటిక్ పార్టీలు బరిలో ఉన్నప్పటికీ రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే పుతిన్ కి చెందిన యునైటెడ్ రష్యానే ఆధిపత్యం చెలాయిస్తుందని గతంలో పుతిన్ ప్రసంగ రచయితగా పనిచేసిన గల్యమోవ్ అన్నారు. ఈ ప్రాంతాల్లో రష్యా భాష మాట్లాడేవారు గణనీయంగా ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఈ ప్రాంతాలను తనలో కలుపుకోవాలని రష్యా భావిస్తోంది. దీనికితోడు రష్యాకు మద్దతుగా వేర్పాటువాదులు ఉన్నారు.

Exit mobile version