Site icon NTV Telugu

ర‌ష్యా హెచ్చ‌రిక‌: తాము యుద్ధానికి దిగం…కానీ…

ర‌ష్యా ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్‌ను ర‌ష్యా ఆక్ర‌మించుకుంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఉక్రెయిన్ ఆక్ర‌మించుకోవ‌డం త‌మ ఉద్దేశం కాద‌ని, తాము ముందుగా యుద్ధానికి దిగ‌బోమ‌ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెవ్ స్ప‌ష్టం చేశారు. అమెరికా విధానాల కార‌ణంగానే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ర‌ష్యా స్ప‌ష్టం చేసింది. సోవియ‌ట్ యూనియ‌న్ దేశాల‌ను నాటోలో చేర్చుకోకూడ‌ద‌నేది త‌మ సిద్ధాంత‌మ‌ని దానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ర‌ష్యా చెబుతున్న‌ది. నాటోలో చేర్చుకునే అంశంపై అమెరికా వాద‌న‌లు వేరుగా ఉన్నాయి.

Read: జ‌న‌వ‌రి 29, శ‌నివారం దిన‌ఫ‌లాలు

నాటోలో చేర‌డం అన్న‌ది ఉక్రెయిన్ ఇష్ట‌మని అమెరికా వాదిస్తున్న‌ది. ఒక‌వైళ ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్య‌కు దిగితే ర‌ష్యా నుంచి నిర్మించిన గ్యాస్‌లైన్ స‌ర‌ఫ‌రాను జ‌ర్మ‌ని అడ్డుకుంటుంద‌ని అమెరికా చెబుతున్న‌ది. బాల్టిక్ స‌ముద్రంలో నాటో ద‌ళాల మోహ‌రింపు ఇప్ప‌టికే భారీగా పెరిగింది. ఇటు ర‌ష్యాకూడా త‌మ ద‌ళాల‌ను భారీగా మోహ‌రించింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర‌మైన ఉద్రిక్త‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ర‌ష్యా తొంద‌ర‌ప‌డి యుద్ధానికి దిగ‌బోద‌ని ఉక్రెయిన్ నేత‌లు చెబుతున్నారు.

Exit mobile version