Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
- 150 ఏళ్లు జీవించేలా రష్యా ప్రయోగాాలు..
- వృద్ధాప్యాన్ని పెంచే జన్యువులే టార్గెట్‌గా కొత్త ఔషధం..
- పుతిన్ కల నెరవేర్చే దిశగా ఆ దేశ శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: మనిషి మరణాన్ని జయించేలా రష్యా కొత్త మందును కనుగొంటోంది. వృద్ధాప్య నిరోధక ఔషధాన్ని అభివృద్ధి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కలను నెరవేర్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఏఐ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మానవులు 150 ఏళ్ల వరకు జీవించగలరని అన్నారు. ఇప్పుడు రష్యా మంత్రి డెనిస్ సెకిరిన్స్కీ మాట్లాడుతూ.. తమ దేశ శాస్త్రవేత్తలు మరణాన్ని ఆలస్యం చేసేలా ప్రపంచంలో మొట్టమొదటి జన్యు చికిత్స ఔషధాన్ని డెవలప్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఈ మందు కణాల వృద్ధాప్యానికి కారణమయ్యే RAGE అనే జన్యువును నిరోధిస్తుంది. ఈ జన్యువు పనిచేయడం వల్ల మనుషులు వృద్ధాప్యానికి గురవుతారు. దీనిని నిరోధించడం వల్ల యవ్వనాన్ని పొడగించవచ్చని సెకిరిన్స్కీ చెప్పారు. RAGE అంటే రిసెప్టర్ ఫర్ అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్‌ప్రొడక్ట్స్. ఇది కణాలలో వృద్ధాప్య ప్రక్రియను ప్రేరేపించే ఒక రిసెప్టర్. జన్యు చికిత్స ద్వారా ఈ రిసెప్టర్‌ను నిరోధించడం ద్వారా కణాలు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేసేలా రష్యన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ మ్యాజిక్ డ్రగ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ ఆఫ్ ఏజింగ్ అండ్ మెడిసిన్‌లో అభివృద్ధి చేస్తున్నారు.
73 ఏళ్ల పుతిన్ దీర్ఘాయువు గురించి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లో మాట్లాడినట్లు వదంతులు వినిపించాయి. పుతిన్ చాలా కాలంగా తన ఆయుర్ధాయాన్ని పెంచుకోవాలనే కోరికలో ఉన్నారు. చాలా కాలం అధికారంలో ఉన్న తర్వాత తన పెద్ద కుమార్తెకు లేదా కుమారుడు 11 ఏళ్ల ఇవాన్ స్పిరోడోనోవ్‌కు అధికారాన్ని అప్పగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2025 నాటికి ఇవాన్‌కు 35 ఏళ్ల వస్తాయి. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడిగా పోటీకి దింపాలని చూస్తున్నారు. అయితే, ఈ వృద్ధాప్య నిరోధక మందులు ఇంచా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. ఒక వేళ శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే ఒక గొప్ప ఔషధం రెడీ అయినట్లే.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!