Site icon NTV Telugu

ర‌ష్యాకు అమెరికా హెచ్చ‌రికః చైనాతో జ‌రాజాగ్ర‌త్త‌…

ప్ర‌పంచంలో అమెరికా, ర‌ష్యా రెండు బ‌ల‌మైన దేశాలు.  ఈ రెండు దేశాల మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  రెండు దేశాల మ‌ద్య సంబంధాలు పెద్ద‌గా లేవ‌ని చెప్పుకొవచ్చు.  అయితే, రెండు దేశాల మ‌ద్య ఉన్న దూరాన్న త‌గ్గించేందుకు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ న‌డుం బిగించారు.  జెనీవాలో జ‌రుగుతున్న నాటో దేశాల శిఖ‌రాగ్ర‌దేశాల స‌ద‌స్సులో రష్యా అధ్య‌క్షుడు కూడా పాల్గోన్నారు.  అమెరికా, ర‌ష్యా దేశాల అధినేత‌లు భేటీ ఆయ్యారు.  రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించారు.  ప్ర‌చ్చ‌న్న‌యుద్ద‌కాలం నాటి ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రెండు దేశాల మ‌ధ్య మంచి సంబంధాలు నెల‌కొనాల‌ని ఆకాంక్షించారు.  అదే విధంగా చైనా నుంచి ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ముప్పుపై కూడా ఇరు దేశాధినేత‌లు చర్చించారు.  చైనాతో స‌రిహ‌ద్దుగా ఉన్న ర‌ష్యాను హెచ్చ‌రించారు.  చైనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రష్యాకు సూచించారు.  ర‌ష్యా హ్య‌క‌ర్స్ వ‌ల‌న వ‌స్తున్న ఇబ్బందుల‌ను కూడా అమెరికా ఈ చర్చల్లో ప్ర‌స్తావించింది.  

Exit mobile version