NTV Telugu Site icon

Russia-Ukraine War: జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడి.. 40 మంది మృతి.. మృతులెవరో తెలుసా?

Russia Ukraine War

Russia Ukraine War

Russia-Ukraine War: వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని జైలుపై ఉక్రెయిన్ అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్లతో దాడి చేసిందని, 40 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించారని, 75 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. అయితే వీరంతా ఉక్రెయిన్​ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని చెప్పారు. 40 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను చంపినట్లు రష్యా ఆరోపించింది. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై ఉక్రెయిన్‌ బలగాలే బాంబు దాడి జరిపినట్లు వేర్పాటువాదుల ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం.

Fire Accident: 15 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి

యుద్ధసమయంలో అజోవ్ ఓడరేవు, స్టీల్​ మిల్లుకు రక్షణగా ఉన్న యోధులు రష్యాకు లొంగిపోయారు. దాదాపు 3 నెలల తర్వాత వారు రష్యాకు లొంగిపోవడంతో వారిని వేర్పాటువాద ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఈ నేపథ్యంలో జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 75 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది జైలు సిబ్బంది కూడా గాయపడ్డారు.