కరోనా పుట్టినిల్లు అయిన చైనాకు సమస్యలు తప్పడం లేదు. ఒక సమస్యపోతే మరో సమస్య చైనాను వెంటాడుతోంది. తాజాగా అక్కడ కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీనికోసం చైనా ఆంక్షలు విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలు ష్యంతో బీజింగ్‌లోని రహదారులు, పాఠశాలు, ఆటస్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా ఇటీవల విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు వినియోగాన్ని పెంచడమే కారణంగా కనిపిస్తుంది. ఇటీవల బొగ్గు కొరతతో ఆదేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షో భాన్ని అరికట్టడం కోసం బొగ్గు వినియోగాన్ని పెంచింది దీంతో ఉత్తర చైనాలో దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు రహదారులపై ఎవ్వరూ నడిచేది కూడా కన్పించ కపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ఫిబ్రవరిలో జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్ 2022కు ఆతిథ్యం ఇచ్చే రాజధాని పాఠశాలలు, శారీరక విద్యా తరగతులు నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. షాంఘై, టియాన్జిన్, హర్బిన్‌తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే హైవేలను ఇప్పటికే మూసివేశారు. యూఎస్ రాయ బార కార్యాలయం వద్ద మానిటరింగ్ మ్యాప్ ద్వారా కాలుష్యం స్థాయిని పరిశీలించగా అక్కడ వాయు కాలుష్యం సాధారణ జనాభాకు హాని కలి గించే విధంగా ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన స్థాయి కన్నా 15 పాయింట్లు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించింది.
గ్రీన్ హౌస్‌ల వాయు వులు ఉత్పత్తి చేసే అతి పెద్ద దేశం చైనా. ఆ దేశం విద్యుత్ తయారీ కోసం ఇప్పటికీ థర్మల్ 60 శాతం పవర్స్ పైనే ఆధారపడి ఉంది. ఇవి నడవాలంటే తప్పనిసరిగా బొగ్గు కావాలి. దీం తో చైనాకు కష్టాలు తప్పడం లేదు. జాతీయ బొగ్గు కేంద్రాలు ఈ వారం ప్రారంభంలో 112మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశాయి. కాలు ష్యాన్ని నియంత్రించడం కోసం ప్రపంచ దేశాలు సీఓపీ 26 తీర్మా నాలు చేస్తుంటే చైనా మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. చైనా కోరి ముప్పును తెచ్చుకోవడంతో పాటు ప్రపంచానికి హని కలిగిస్తుంది.
