Pentagon Report: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి 2022లో సైనికి ఉనికిని, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచింది. ఈ విషయాలను అమెరికా పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ నివేదిక 2023 ప్రకారం.. భూగర్భ నిల్వ సౌకర్యాలు, కొత్త రోడ్లు, డ్యూయల్ పర్పస్ ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణాలు ఎల్ఏసీ వెంబడి పెరిగాయి.
మే 2020 నుంచి భారత-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఆర్మీకి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. భారత సరిహద్దు వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతోంది. 20 మంది భారత సైనికులు ప్రాణాలను తీసుకున్న గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత చైనా ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఎల్ఏసీ వెంబడి పెద్ద ఎత్తున మోహరింపులను చేపడుతోంది. ఈ విస్తరణ ఈ ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉందని పెంటగాన్ నివేదిక పేర్కొంది.
డోక్లాం సమీపంలో భూగర్భ నిల్వ సౌకర్యాలు, ఎల్ఏసీలోని 3 సెక్టార్లలో కొత్త రోడ్లు, సొరంగాలును నిర్మిస్తోంది. భూటాన్ సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేస్తోంది. పాంగ్యాంగ్ సరస్సుపై రెండో వంతెన, సెంటర్ సెక్టార్ కి సమీపంలో డ్యూయర్ పర్పస్ ఎయిర్ పోర్టు, చాలా హెలిప్యాడ్లను నిర్మిస్తోంది. చైనా 2022 ఎల్ఏసీ వెంబడి ఒక బోర్డర్ రెజిమెంట్‌ని మోహరించింది. దీనికి మద్దతుగా షింజియాంగ్, టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్స్‌కి చెందిన రెండు డివిజన్లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు నాలుగు కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్లను రిజర్వులో ఉంచింది.
Read Also: Health Tips : ప్రతి రోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి..
500కు పైగా అణు వార్‌హెడ్లు:
పెంటగాన్ నివేదిక ప్రకారం.. చైనా వద్ద ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ఆపరేషనల్ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయని, 2030 నాటికి ఇవి 1000 కంటే ఎక్కువ ఉండవచ్చని పేర్కొంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద చైనా నౌకాదళం మరింత అభివృద్ధి చెందుతోందని పేర్కొంది.
ప్రస్తుతం పీపుల్ లిబరేషన్ ఆర్మీ వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్ధంగా ఉన్నాయి. దేశంలో మూడు ప్రాంతాల్లో వీటిని మోహరించడానికి వీలుగా 2022లో భూగర్బ బొరియలను నిర్మించింది. ఇదే కాకుండా బర్మా, థాయ్ లాండ్, ఇండోనేషియా, యూఏఈ, కెన్యా, నైజీరియా, నమీబియా, మెజాంబిక్, బంగ్లాదేశ్, పపువా న్యూగినియా, సాల్మన్ ఐలాండ్స్, తజకిస్తాన్ వంటి ప్రాంతాల్లో మిలిటరీ బేస్ లు, లాజిస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.