Site icon NTV Telugu

UK’s Asian Rich List 2022: యూకే ఆసియా సంపన్నుల జాబితాలో రిషిసునాక్, భార్య అక్షతామూర్తి

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak, Wife Akshata Murty Debut On UK’s ‘Asian Rich List 2022’: యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తి యూకే ఆసియా సంపన్నుల జాబితాలో చేరారు. ఆసియన్ రిచ్ లిస్ట్ 2022లో తొలిసారిగా చోటు సంపాదించారు. ఈ జాబితాలో హిందూజా గ్రూప్ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె. ఈ జాబితాలో వీరిద్దరు 790 మిలియన్ పౌండ్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు.

Read Also: Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ

హిందుజా కుటుంబం 30.5 బిలియన్ పౌండ్ల సంపదతో వరసగా ఎనిమిదోసారి తొలిస్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే హిందూజా కుటుంబ ఆస్తులు 3 బిలియన్ పౌండ్లు పెరిగాయి. వెస్ట్‌మిన్‌స్టర్ పార్క్ ప్లాజా హోటల్‌లో జరిగిన 24వ వార్షిక ఏషియన్ బిజినెస్ అవార్డ్స్‌లో హిందూజా గ్రూప్ కో-ఛైర్మన్ గోపీచంద్ హిందూజా కుమార్తె రీతూ ఛబ్రియాకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ‘ఆసియన్ రిచ్ లిస్ట్ 2022’ కాపీని అందించారు. లక్ష్మీ మిట్టల్, అతని కుమారుడు ఆదిత్య ఆస్తుల విలువ 12.8 బిలియన్ పౌండ్లు, ప్రకాష్ లోహియా కుటుంబం 8.8 బిలియన్ పౌండ్లు, నిర్మల్ సేథియా 6.5 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నారు. వీరంతా ఆసియన్ రిచ్ లిస్ట్ 2022 జాబితాలో ఉన్నారు.

బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకన్నారు. 42 ఏళ్ల రిషి సునాక్, లిజ్ ట్రస్ రాజీనామాతో ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి రిషి సునాక్ మాత్రమే గట్టేక్కిస్తారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. 210 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.

Exit mobile version