NTV Telugu Site icon

Rishi Sunak: యూకే పీఎం రేసు నిలబడుతున్నట్లు స్పష్టం చేసిన రిషి సునక్

Rishi Sunak

Rishi Sunak

వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ‘‘ ఈ క్షణంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.. అందుకే నేను కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా.. మీ ప్రధానమంత్రిగా పోటీలో నిలబడుతాను’’ అని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రధాని బోరిస్ జాన్సన్, 42 ఏళ్ల రిషి సునక్ ని ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన క్యాబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో కార్మికులు, వ్యాపారుల కోసం 10 మిలియన్ల పౌండ్ల భారీ ప్యాకేజీ ప్రకటించి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. రిషి తాతముత్తాతలు పంజాబ్ నుంచి బ్రిటన్ కు వలస వచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు

Read Also: K Laxman: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది

ప్రధాని పదవి కోసం ప్రచారాన్ని మొదలుపెట్టిన రిషి సునక్ తన అమ్మమ్మ బ్రిటన్ కు వచ్చని కథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఎన్నో ఆశలతో మెరుగైన జీవితం కోసం తన అమ్మమ్మ బ్రిటన్ కు వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం యూకే అనేక ఛాలెంజెస్ ను ఎదుర్కొంటోందని.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను బలపరచాలని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.  రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయితే ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కనున్నారు.