NTV Telugu Site icon

Baba Vanga: ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..

Baba Vanga

Baba Vanga

Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.

ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలువబడే బాబా వంగా గతంలో అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, బ్రెగ్జిట్ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారు.

Read Also: Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే

అయితే, 2024లో జరిగే ఏడు సంఘటనలను ఆమె ఊహించింది. ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వీటని డైలీ స్టార్ నివేదించింది.

* వచ్చే ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తోటి దేశస్తుడు హత్యయత్నానికి పాల్పడుతాడు.
* యూరప్‌లో ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించారు. దీంతో పాటు వచ్చే ఏడాది ఓ పెద్ద దేశం జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడుల్ని నిర్వహిస్తుంది.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రుణ స్థాయిలు పెరగడం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం.
* 2024లో భయానక ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
* సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆధ్యాత్మికవేత్త పేర్కొన్నారు. అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్‌లు మరియు నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
* అల్జీమర్స్, క్యాన్సర్ వంటి నయంచేయలేని రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
*క్వాంటం కంప్యూటింగ్ లో కీలక పరోగతి ఉంటుందని అంచనా వేశారు.
1911లో వాంపజేలియ పాండేవా డిమిత్రోవా జన్మించారు. ఆ తరువాత ఆమె పేరు బాబా వంగాగా మారింది. 12 ఏళ్ల వయసులో ఓ భారీ తుఫానులో ఆమె తన కళ్లను కోల్పోయింది.