Site icon NTV Telugu

Justice NV Ramana: రాజకీయాల్లోకి నీతిమంతులు రావాలి.. లేకపోతే అవినీతిపరులు రాజ్యమేలుతారు: జస్టిస్‌ ఎన్‌వి రమణ

Jestice Nv Ramana

Jestice Nv Ramana

Justice NV Ramana: రాజకీయాల్లోకి నీతిమంతులు రావాలని… లేకపోతే అవినీతిపరులు రాజ్యమేలుతారని భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు. మానసిక పరిపత్వ సరిగా లేని వారే .. జాత్యహంకార, కులహంకార ఆలోచనలు చేస్తారనీ.. వాటిని రెచ్చగొడతారని ఎన్ వి ర‌మ‌ణ అన్నారు. నేటి రాజ‌కీయాలు పూర్తిగా భ్రష్టుప‌ట్టాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో జరుగుతున్న 23వ తానా మహాసభల్లో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగించారు.

Read also: Samyuktha Hegde : టాప్ లేకుండా వీడియో పోస్ట్ చేసిన బ్యూటీ.. మైండ్ బ్లాకే..

అమెరికాలోని భారతీయులు కష్టజీవులని, నిజాయితీ పరులని.. కానీ వారిలో ఐక్యత లేదనీ, కలహించుకుంటారని ఆ విషయం తనని బాధపెట్టిందని ఎన్‌వి రమణ అన్నారు. ఇంత చదువులు చదివి, ఇంతింత అనుభవం గడించిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారాన్ని నమ్మి వినాశానికి ఊతమిస్తున్నామంటే.. రాబోయే తరాలు మనల్ని క్షమించవని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో కుల వివక్ష తగ్గుతోందనీ, కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ ప్రగతిశీల అమెరికా సమాజంలో నివసించే భారతీయ సంతతికి చెందిన వారు కులం, మతం అంటూ పొట్లాడుకోవడం సిగ్గుచేటని, ఆ విషయం తనని చాలా బాధపెట్టిందని అన్నారు. ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలెలా నడుపుతార‌ని, వారికి రాజకీయాలు ఏం తెలుస్తాయని అన్నారు. రానురాను రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయ‌ని పేర్కొన్నారు. ప్రపంచ రాజకీయాల్లో వికృత ధోరణి ప్రారంభమైందనీ, రాజకీయ పార్టీల నిర్వహణ, ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ప్రజలతో సంబంధం లేనివారు రాజకీయాలు ఎలా చేస్తారని జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

Read also: Samosa: ఈ సమోసా చాలా కాస్ట్లీ గురూ.. 25 ప్లేట్లు రూ.1.40లక్షలు

దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా మారింద‌ని, మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింద‌ని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజ‌ల‌ను పక్కదోవ పట్టిస్తున్నార‌ని, ఓటర్లను ప్రలోభలకు గురి చేస్తూ.. ఓట్లు దండుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని మాజీ సుప్రీంకోర్టు చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో నీతిమంతులు రాకపోతే.. అవినీతిపరులు, నీతిలేని వారే రాజ్యమేలుతారని పేర్కొన్నారు. వారు చేతుల్లోకి అధికారం వెళ్తే.. వారు చేసే విధ్వంసాన్ని పూడ్చడానికి దశాబ్దాలు పడుతుంద‌ని హెచ్చరించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు పోరాడాలని పిలుపు ఇచ్చారు. విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయడం వల్లే అథోగతి పాలవుతున్నామ‌ని,. కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పిలుపు ఇచ్చారు.

Exit mobile version