NTV Telugu Site icon

Pakistan: పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మరణశిక్ష రద్దు చేయాలని తీర్మానం..

Julfikar Ali Bhutto

Julfikar Ali Bhutto

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఉరితీయబడ్డాడు. రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై 1979లో లాహోర్ హైకోర్టు భుట్టోకి మరణశిక్ష విధించింది. సైనిక తిరుగుబాటుకు పాల్పడి భుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు, ఇతర అభియోగాలు మోపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పాకిస్తాన్ న్యాయవ్యవస్థ సరిగా పనిచేయలేదనే భావన ఉంది.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మరణశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాక్ పార్లమెంట్లో బుధవారం ఒక తీర్మానం ఆమోదించబడింది. మాజీ ప్రధాని న్యాయవిచారణ సరిగా జరగలేదని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా అభిప్రాయపడిన కొన్ని రోజుల తర్వాత ఈ తీర్మానం ఆమోదించబడింది. మార్చి మార్చి 18, 1978న, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అహ్మద్ రెజా కసూరిని హత్య చేయాలని ఆదేశించినందుకు జుల్ఫికర్ అలీ భుట్టోకు లాహోర్ హైకోర్టు మరణశిక్ష విధించింది.

Read Also: Tatkaal Passport: ఎమర్జెన్సీ​గా విదేశాలకు వెళ్లాలా..? అయితే ‘తత్కాల్ పాస్ ​పోర్ట్’ ఎలా​ అప్లై చేయాలంటే..?!

2011లో అప్పటి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన మామ అయిన భుట్టో మరణశిక్షను పున:సమీక్షించాలని సుప్రీంకోర్టుని కోరారు. ప్రస్తుతం మరోసారి పాక్ అధ్యక్షుడిగా జర్దారీ ఎన్నికయ్యారు. జుల్ఫీకర్ అలీ భుట్టో కుమార్తె మాజీ ప్రధాని జెనజీర్ భుట్టోని ఆసిఫ్ అలీ జర్దారీ వివాహం చేసుకున్నారు. జుల్ఫికర్ అలీ భుట్టో ఉరిశిక్షకి విధించగా.. టెర్రరిస్టుల దాడిలో బెనజీర్ భుట్టో మరణించారు.

భుట్టో కేసులో ఇచ్చిన అన్యాయమైన తీర్పును రద్దు చేయాలని ప్రస్తుత తీర్మానంలో డిమాండ్ చేశారు. గత వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఖాజీ ఫేస్ ఇసా మాట్లాడుతూ.. లాహోర్ హైకోర్టు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు చేసిన విచారణ ప్రాథమిక హక్కులకు అనుగుణంగా లేదని పేర్కొన్నారు. మరోవైపు పాక్ ఫెడరల్ ప్రభుత్వం భుట్టోని అధికారికంగా షహీద్, నేషనల్ డెమోక్రటిక్ హీరోగా ప్రకటించాలని, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ‘‘నిసాన్-ఏ-జుల్పికర్ అలీ భుట్టో’’ అవార్డుని ఏర్పాటు చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు.