NTV Telugu Site icon

Girl Friend On Rent: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌.. చైనా యువకుల కొత్త ప్లాన్

China

China

Girl Friend On Rent: చైనాలో జనాభా వృద్ధి గణనీయంగా తగ్గిపోతోంది. 30 ఏళ్లు నిండిన యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఒంటరి జీవితానికే ఓటేస్తున్నారు. దీంతో సంతానోత్పత్తి రేటు తగ్గడంతో జనాభా వృద్ధి తగ్గుతోంది. గత 40 ఏళ్లతో పోలిస్తే 2022లో అతి తక్కువ జనాభా వృద్ధి చైనాలో నమోదు అయింది. వన్ చైల్డ్ విధానం కూడా ఇందుకు ఓ కారణం అయింది. దీంతో ఇప్పుడు చైనాలో ముసలి జనాభా పెరిగింది.

Read Also: Jinping Russia Visit: క్వాడ్, ఆకస్‌పై పుతిన్, జిన్ పింగ్ ఆగ్రహం.. ఒకదాంట్లో భారత్‌కు సభ్యత్వం

ఇదిలా ఉంటే తల్లిదండ్రల నుంచి వచ్చే పెళ్లి ఒత్తడిని తగ్గించుకోవడానికి చైనా యువకులు కొత్త ప్లాన్ వేశారు. అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ ను తెచ్చుకుంటున్నారు. కుటుంబాల్లో, సోషల్ టూర్లలో తమ పరువు కాపాడుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు తీసుకుంటున్నారు. రోజుకు 145 డాలర్ల (1000 యువాన్లు)ను చెల్లిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారంలో అనేక ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు ఇచ్చే వెబ్ సైట్లు పెరిగాయి. కుటుంబం, స్నేహితుల ఒత్తడి నుంచి తప్పించుకోవడానికి పురుషులు, తమ గర్ల్ ఫ్రెండ్స్ అని అద్దె గర్ల్ ఫ్రెండ్ ను చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్వలింగ సంపర్కులుగా ఉన్న పురుషులు పరువు కోసం గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

చైనా ల్యూనార్ న్యూ ఇయర్ సందర్భంగా తాను ఒక రోజుకు 5800 డాలర్లను సంపాదించినట్లు తెలిపింది ఓ అమ్మాయి. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ లో బహిర్గతం అయింది. కొన్నిసార్లు టైం పెరిగితే ఛార్జీలను కూడా పెంచుతామని, ముద్దులు, సెక్స్ చేస్తే అదనంగా మరింత వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఎక్కువ సమయానికి అదనంగా మరో 500 యువాన్లు, ప్రయాణానికి 350 యువాన్లు చెల్లిస్తున్నారు.

Show comments