Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..

  • కాబూల్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి..
  • 400 మందికి పైగా మృతి..
  • ఇది ‘‘యుద్ధనేరం’’ అంటూ అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
Afghanistan

Afghanistan

Pak-Afghan war: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కాబోతోంది. సోమవారం రాత్రి, ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి పాకిస్తాన్ వైమానిక దళం చేసినట్లు తాలిబన్లు ఆరోపించారు. పాకిస్తాన్ మాత్రం తాము ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని, పౌరులపై దాడులు చేయలేదని చెబుతోంది. పాక్ దాడితో 2000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి దారుణంగా దెబ్బతింది.

Read Also: Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

ఈ దాడిపై ఆఫ్ఘాన్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ దీనిపై స్పందిస్తూ..‘‘పౌర ప్రాంతాలు, ఆస్పత్రులు లక్ష్యంగా దాడి చేయడం యుద్ధం నేరం’’ అని, వెంటనే కలుగజేసుకోవాలని ఐక్యరాజ్యసమితిని డిమాండ్ చేశారు. మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కూడా దీనిపై భావోద్వేగంగా స్పందించారు. ‘‘రంజాన్ పవిత్ర రాత్రిలో అమాయకుల ప్రాణాలు తీయడం అమానుషం’’అని పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సివిలియన్ ప్రాంతాలు, ఆస్పత్రులపై దాడులు చేయడం మానవత్వానికి వ్యతిరేకమని అన్నారు.