Site icon NTV Telugu

Raccoon: మద్యం దుకాణంలో మందు తాగి పడుకున్న జంతువు.. కంగుతిన్న ఓనర్

Untitled Design (9)

Untitled Design (9)

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆష్లాండ్‌లోని ఒక మద్యం దుకాణంలో సీలింగ్ టైల్ విరిగి, అక్కడి నుంచి ఒక రకూన్ (కుందేలును పోలి ఉండే అడవి జంతువు) అకస్మాత్తుగా లోపలికి పడిపోయింది. ఘటన సమయంలో దుకాణం మూసి ఉండటంతో, భయపడిన రకూన్ అక్కడ ఉన్న స్కాచ్, విస్కీ వంటి మద్యం సీసాలను పగులగొట్టింది.

పగిలిపోయిన సీసాలలో పారుతున్న మద్యం తాగిన రకూన్ మత్తులో దుకాణంలోని బాత్రూమ్‌కి వెళ్లి అక్కడే పడిపోయింది. మరుసటి ఉదయం విధుల్లోకి వచ్చిన ఉద్యోగులు బాత్రూమ్‌లో రకూన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రకూన్‌ను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కొద్ది సేపటి చికిత్స తర్వాత రకూన్ పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని తిరిగి అడవిలో వదిలివేశారు.

Exit mobile version