Queen Elizabeth-2: యూకేను ఎక్కువ కాలం పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్-2 తన 96 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కన్నుమూసినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు తెల్లవారుజామున రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో బాల్మోరల్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ప్యాలెస్ తెలిపింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్యాలెస్‌కు తరలివస్తున్నట్లు సమాచారం. ఆమె ఈ నెల 6న ఆ దేశ నూతన ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. 96 సంవత్సరాల వయసుగల క్వీన్ ఎలిజబెత్-2కు గత ఏడాది అక్టోబరు నుంచి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. నిల్చోవడానికి, నడవడానికి ఆమె చాలా ఇబ్బందిపడుతున్నారు. బుధవారం ఆమె ప్రీవీ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేశారు.
బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. ఎలిజబెత్-2 ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్‌లకు క్వీన్ ఎలిజబెత్-2 మొదటి సంతానం. గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. ఆమె పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్ర మేరీ. ఎలిజబెత్-2 చిన్ననాటి నుంచే ప్రజాసేవకు మక్కువ చూపారు.
క్వీన్ ఎలిజబెత్-2 అత్యధిక కాలం పాలించి చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు బ్రిటన్‌కు రాణిగా ఉన్నారు ఎలిజబెత్-2. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెదాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఉన్నారు. 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు.
Queen Elizabeth-2: బ్రిటీష్ క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన
యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న థాయ్‌లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు. 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసనాన్ని అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఒకవేళ అనారోగ్యంతో గనుక ఆమె మరణిస్తే ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటిస్తారు. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు. ఎలిజబెత్-2 తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్-3 పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Statement from the King at the time of the death of Queen Elizabeth II.
"The death of my beloved mother, The Queen is a moment of the greatest sadness for me and all members of my family," reads the statement pic.twitter.com/901kXJ8IRk
— ANI (@ANI) September 8, 2022
Statement from the Archbishop of Canterbury, Justin Welby on the death of Queen Elizabeth II pic.twitter.com/fh7btH0k9c
— ANI (@ANI) September 8, 2022
