ఉక్రెయిన్‌పై రష్యా దాడులను చూస్తే.. వారం పది రోజుల్లో ఉక్రెయిన్ మొత్తం రష్యా ఆధీనంలోకి వస్తుందనే అంచనాలు మొదట్లో కనబడ్డాయి.. కానీ, ఉహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ఎదురుదాడి జరుగుతూనే ఉంది.. అయితే, రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని అనుమానిస్తున్నారు పుతిన్. అందుకే దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో సన్నిహతులు అని కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు చేపట్టారు. ఉక్రెయిన్ పోరు జఠిలం అయ్యే కొద్దీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరింత మొండిగా మారుతున్నారు.
Read Also: Ukraine Russia War: రష్యాకు షాక్ ఇచ్చిన మరో కీలక సంస్థ..!
ఇటీవల సిరియా విధ్వంసకుడు అలెగ్జాండర్ దివొర్నికొవ్‌కు ఆపరేషన్ బాధ్యతలు అప్పజెప్పగా.. ఇప్పుడు విదేశీ గూఢచర్య విభాగం కీలక అధికారిని నిర్బంధంలోకి తీసుకొన్నారు. రాత్రికి రాత్రే డజన్ల కొద్దీ అధికారులపై చర్యలు తీసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అరెస్టైన వారి సంఖ్య దాదాపు 150 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. మొత్తంగా కీలకమైన.. ఫెడరల్ సెక్యూరిటీ బ్యూరో (ఎఫ్‌ఎస్‌బీ)లోని దాదాపు 150 మంది అధికారులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలగించారని, వారిలో కొందరిని అరెస్టు చేశారని బ్రిటిష్ వార్తాపత్రికలు నివేదిస్తున్నాయి.. పుతిన్ 1998లో FSB డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే అదే ఆయనకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది..
