Site icon NTV Telugu

Edward Snowden: అమెరికా మోస్ట్ వాంటెడ్‌కు రష్యా పౌరసత్వం.. పుతిన్ కీలక నిర్ణయం

Edward Snowden

Edward Snowden

Putin Grants Russian Ctizenship To US’s Edward Snowden: అమెరికాకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ సోమవారం డిక్రీపై సంతకం చేశారు. 39 ఏళ్ల స్నోడెన్ అమెరికా నుంచి పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నాడు. 2013లో అమెరికా రహస్య ఫైళ్లను లీక్ చేసిన తర్వాత రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.

యూఎస్ నేషనల్ ఏజెన్సీలో కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ గా ఉన్న సమయంలో దేశంలో అంతర్జాతీయ దేశాలపై అమెరికా నిఘాను బహిర్గతం చేశాడు. అప్పటి నుంచి ఎడ్వర్డ్ స్నోడెన్ పై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఎడ్వర్డ్ స్నోడెన్. అతన్ని అమెరికాకు అప్పగించాలని పలుమార్లు కోరింది. అమెరికాలో విచారణ ఎదుర్కోవడానికి తిరిగి రప్పించేందుకు అక్కడి అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు.

Read Also: JP Nadda: కేరళ ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారింది.. మత ఘర్షణలు పెరిగాయి.

తాజాగా సోమవారం పుతిన్ 75 మంది విదేశీయులకు రష్యన్ పౌరసత్వాన్ని మంజూరు చేశారు. అందులో యూఎస్ మోస్ట్ వాంటెడ్ కు రష్యా పౌరసత్వాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి రహస్య సమాచారం లీక్ చేయడంతో ఆయన అక్కడి ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకునేందుకు 2013లో రష్యాకు పారిపోయాడు. అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నాడు. రష్యా ప్రభుత్వం 2020లో ఆయనకు శాశ్వత నివాసాన్ని మంజూరు చేసింది. యూఎస్ పౌరసత్వం వదులుకోకుండా.. రష్యా పౌరసత్వ కోసం ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పాడు.

Exit mobile version