NTV Telugu Site icon

Russia: పుతిన్ సన్నిహితుడైన మిస్సైల్ డెవలపర్ హత్య..

Russia

Russia

Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి సన్నిహితుడిగా భావించే మిఖాయిల్ షాట్స్కీ హత్య చేయబడ్డాడు. ఇతను రష్యన్ మిస్సైల్ డెవలపర్‌గా ఉన్న ఇతడిని మృతదేహాన్ని మాస్కోలో కనుగొన్నారు. కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన క్షిపణులను డెవలప్ చేసిన రష్యన్ కంపెనీ మార్స్ డిజైన్ బ్యూరో డిప్యూటీ జనరల్ డిజైనర్‌గా, సాఫ్ట్‌వేర్ అధిపతిగా షాట్స్కీ ఉన్నారు.

Read Also: Allu Arjun : బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండాలా?

రష్యన్, ఉక్రెయిన్ సోర్సెస్ ప్రకారం.. మాస్కో రీజియన్‌లోని క్రెమ్లిన్‌కి ఆగ్నేయంగా 8 మైళ్ల దూరంలో ఉన్న కోటెల్నిలోని కుజ్మిన్స్కీ ఫారెస్ట్ పార్కులో గుర్తుతెలియని వ్యక్తి షాట్స్కీని కాల్చి చంపాడు. రష్యన్ స్పేస్, మిలిటరీ పరిశ్రమ కోసం ఆన్‌బోర్డ్ నావిగేషన్ వ్యవస్థని రూపొందించే, ఉత్పత్తి చేసే కంపెనీలో కీలకంగా ఉన్నారు. డిసెంబర్ 2017 నుంచి స్టేట్ కార్పొరేషన్ రోసాటమ్ విభాగంలో భాగంగా ఉంది. రష్యాలో Kh-59 క్రూయిజ్ క్షిపణిని Kh-69 స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంలో కీలకంగా ఉన్నాడు. ఉక్రెయిన్‌పై వీటితోనే రష్యా దాడి చేస్తోంది.