NTV Telugu Site icon

Hamas Attack On Israel: “ఈ దాడి గర్వంగా ఉంది”.. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు..

Israel

Israel

Hamas Attack On Israel: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా గాజా నుంచి హమాస్ తీవ్రవాదులు భీకరదాడులు చేశారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ నగరాలు, పట్టణాలపై ప్రయోగించారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి వెళ్లిన హమాస్ తీవ్రవాదులు అక్కడి సాధారణ పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. పలువురు ఇజ్రాయిల్ జాతీయులను బందీలుగా పట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ దాడిన భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు యూకే పీఎం రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ వంటి ప్రపంచ నేతలు ఖండిస్తున్నారు. అమెరికా కూడా ఈ దాడిని ఖండించింది. మరోవైపు ఇజ్రాయిల్ తాము యుద్ధంలో ఉన్నట్లు ప్రకటించింది. గాజాను అన్ని వైపుల నుంచి ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముడుతోంది. ఈ దాడికి పాల్పడిన హమాస్ తీవ్ర మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.

Read Also: Israel: ఇజ్రాయిల్‌కి అండగా ఉంటామన్న ప్రధాని మోడీ.. ప్రపంచ నేతల మద్దతు..

ఇదిలా ఉంటే అన్ని దేశాలు ఇజ్రాయిల్ పై జరిగి దాడిని ఖండిస్తుంటే, ఆ దేశ బద్ధ శత్రువు ఇరాన్ మాత్రం ఈ దాడికి మద్దతు నిలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుగా ఉణ్న రహీమ్ సఫానీ ఈ దాడిని పొగుడుతూ మాట్లాడారు. ‘‘ఇది గర్వించదగిన ఆపరేషన్’’ అని అన్నారు. గర్వించదగిన అల్ అక్సా ఆపరేషన్ కి తాము మద్దతు ఇస్తున్నామని, పాలస్తీనా మద్దతుగా జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. మేము ఈ ఆపరేషన్ కి మద్దతు ఇస్తున్నాము, రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా దీనికి మద్దతు ఇస్తుందని అన్నారు.