NTV Telugu Site icon

Mamata Banerjee: లండన్ టూర్‌లో నిరసన సెగ.. తిప్పికొట్టిన సీఎం మమత

Mamatabanerjee

Mamatabanerjee

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. బ్రిటన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి మమత యూకేలో పర్యటిస్తున్నారు. అయితే గురువారం లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగ్ కళాశాలలో మమత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2023లో పంచాయతీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింస, కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనపై విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి: Nirmal: ప్రేమ వివాహం.. ఒకే మండపంలో ఇద్దరి యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు..

దీంతో నిరసనకారుల ఆందోళనపై మమత స్పందించారు. ఈ ఆందోళన ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. దయచేసి గొంతు పెంచాలన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. మీ గొంతు పెంచండి.. తాను జాగ్రత్తగా వింటానని చెప్పారు. ఆర్జీకర్ అత్యాచార ఘటన కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా ఈ స్థలంలో రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. చేయాలనుకుంటే బెంగాల్‌కు వచ్చి చేయొచ్చని తెలిపారు. టీఎంసీ నాయకుడు తమ వేళ్లు విరిచేస్తానని బెదిరించాడని ఒక విద్యార్థి అనగా.. నువ్వు అబద్ధం చెబుతున్నావని.. ఇక్కడ రాజకీయాలొద్దని సూచించారు. సోదరుడు అలా చేయొద్దని.. మీరంటే ప్రత్యేక అభిమానం ఉందని మమత పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Mazaka : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మజాకా.. ఎక్కడ చూడాలంటే.?

ఈ సందర్భంగా 1990 నాటి చిత్రాన్ని మమత చూపించారు. తన సీపీఐ(ఎం) యువజన విభాగం కార్యకర్త లాలూ ఆలం.. తనపై హత్యాయత్నం చేశాడని.. 2019లో ఈ కేసులో ఆధారాలు లేకవడంతో విడుదలైనట్లు చెప్పుకొచ్చారు. తనను చంపినోళ్లే ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ తనను అవమానించడం లేదని.. మీ విద్యాసంస్థనే అవమానిస్తున్నారని మమత మండిపడ్డారు. ఎక్కడికెళ్లినా గందరగోళం సృష్టించడం మొదటి నుంచి వామపక్షాలకు అలవాటేనన్నారు. దీదీ ఎప్పుడూ రాయల్ బెంగాల్ టైగర్‌లాగా ఉంటుందని మమత పేర్కొన్నారు. దీంతో కొంత మంది విద్యార్థులు చప్పట్లు కొట్టారు. నిర్వాహకుల సూచనతో నిరసనకారులు బయటకు వెళ్లిపోవడంతో మమత ప్రసంగం కొనసాగించారు.