NTV Telugu Site icon

Priyanka Chopra: ఇరాన్ మహిళల హిజాబ్ వ్యతిరేక పోరాటానికి ప్రియాంకా చోప్రా మద్దతు

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra On Anti-Hijab Protests In Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక పోరాటం జరుగుతోంది. అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమినే అమ్మాయి సెప్టెంబర్ 13న టెహ్రన్ మెట్రోస్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు టార్చర్ వల్ల మహ్సా అమిని మరణించింది. దీంతో ఇరాన్ లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

మహ్స అమిని మృతి చెందడంతో అక్కడి మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. స్కూల్ విద్యార్థినులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ నిరసనల్లో ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోవడం లేదు. తమ హక్కుల కోసం యువత, మహిళలు ఉద్యమిస్తున్నారు. నిరసనలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా 90 మందికి పైగా మరణించారు.

Read Also: Aryan Just Ignore Ananya: లైగర్‌ బ్యూటీని చూసి మోహం తిప్పుకున్న ఆర్యన్.. అయ్యో పాపం అంటూ నెటిజన్లు ట్రోల్‌

ఇదిలా ఉంటే హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మద్దతు తెలిపారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో మద్దతు తెలపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లోని మహిళలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. హిజాబ్ కు వ్యతిరేకంగా జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఇరాన్ మోరాలిటీ పోలీసుల చేతిలో మరణించిన మహ్సా అమిని కోసం అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. కొన్నేళ్లుగా ఇరాన్ లో మూగబోయిన గొంతులు అగ్నిపర్వతంలా పేలవచ్చు అని రాసుకొచ్చింది.

మీ ధైర్యం నన్ను ఆశ్చర్యపరిచిందని.. మీ హక్కుల కోసం మీ ప్రారాణాలను పణంగా పెట్టి పోరాడటం అంత సులభమైన విషయం కాని అంది. అధికారంలో ఉన్నవారు, అధికారులు నిరసనకారుల పిలుపును వినాలని.. వారి సమస్యలను అర్థం చేసుకోవాలని ప్రియాంకా చోప్రా కోరారు. జిన్, జియాద్, ఆజాదీ(స్త్రీలు, జీవితం, స్వేచ్ఛ) అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చారు ప్రియాంకా చోప్రా