Priti Patel: షాకిచ్చిన ప్రీతి పటేల్.. హోం మంత్రి పదవికి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priti Patel Announced Her Resignation After Lizi Truss Won UK PM Election: ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్ దాదాపు 21 వేల ఓట్లతో గెలుపొందిన తర్వాత.. ఆ దేశ హోం మంత్రి ప్రీతి పటేల్ ఊహించని షాకిచ్చింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ప్రధానిగా ఎంపికైన లిజ్ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రీతి, దేశ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తన స్థానంలో కొత్త హోం మంత్రి వస్తారని తెలిపింది. లిజ్ ట్రస్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతోన్న బోరిస్ జాన్సన్‌కు లేఖ రాసింది. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో దేశానికి హోం మంత్రిగా సేవలు అందించే సౌభాగ్యం దక్కినందుకు తనకు సంతోషంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. అంతేకాదు.. 2019లో బోరిస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి గడ్డు పరిస్థితులను, వాటిని పరిష్కరించిన విషయాలను పేర్కొంది. ఆయన హయాంలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి కోసం చేసిన కృషి గురించి చర్చించింది. ఆ సుదీర్ఘ లేఖలో, బోరిస్ జాన్సన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
కాగా.. భారత సంతతి మహిళ అయిన ప్రీతి పటేల్, చిన్న వయసులోనే కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలు అయ్యింది. 2010లో ఎంపీగా గెలుపొందిన ఆమె.. 2014లో ఆర్ధిక మంత్రిగా పని చేశారు. 2015 ఎన్నికల్లో గెలుపొందాక ఉపాధి శాఖ సహాయ మంత్రిగా చేశారు. థెరిసా మే ప్రభుత్వంలో అంతర్జాతీయ అభివృద్ధి శాఖలో ప్రీతికి రాష్ట్రమంత్రి పదవి దక్కింది. అయితే.. 2017లో ఇజ్రాయెల్ వివాదం కారణంగా ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదిలావుండగా.. బ్రిటన్ ప్రధాని పోటీలో లిస్ ట్రస్, రిషి సునాక్ నిలవగా.. దాదాపు 21 వేల ఓట్ల మెజారిటీతో లిస్ ట్రస్ గెలుపొందింది. ఆమె మంగళవారం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!