NTV Telugu Site icon

Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు ఇండియా.. ఎన్నో స్థానం అంటే..

Press Freedom Index

Press Freedom Index

Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో భారత్ మరింత దిగువ స్థానానికి పడిపోయింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2023లో భారత్ 161 స్థానానికి పరిమితం అయింది. గతేడాది 150 స్థానంలో ఉన్న భారత్.. 11 స్థానాలు దిగజారింది. రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) అనే గ్లోబల్ మీడియా వాచ్‌డాగ్ ప్రతీ ఏడాది వివిధ దేశాల్లోని మీడియా స్వేచ్ఛపై ప్రెస్ ప్రీడం డే రోజున ఈ ర్యాంకులను ప్రచురిస్తుంటుంది.

Read Also: Trisha : అందంతో పిచ్చెక్కిస్తున్న త్రిష.. స్టైలిష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా

మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. ఈ ఏడాది ప్రకటించి ర్యాంకుల్లో ఇండియా స్థానం దిగజారింది. చివరి దేశాల జాబితాలో చేరింది. మీడియా స్వేచ్ఛ సమస్యాత్మక జాబితా నుంచి అత్యంత దారుణ స్థితికి ఇండియాతో పాటు టర్కీ, తజకిస్తాన్ చేసుకున్నాయని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. రాజకీయ నేతలకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీడియా సంస్థల్ని కొనుగోలు చేసి వార్తల స్వేచ్ఛా ప్రసారాలను అడ్డుకుంటున్నారని నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే మీడియా స్వేచ్ఛలో భారత్ మరింతగా దిగజారడంపై ఇండియన్స్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్రను పరిమితం చేయడం సరికాదని, అభద్రతా భావంతో కూడిన పని పరిస్థితులు ఎప్పటికీ మీడియాకు స్వేచ్ఛను ఇవ్వలేవని ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.