President Biden’s ‘Salute’ To PM Modi At G20: ఇండోనేషియా బాలిలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, ఇతర అధినేతలు మడ అడవులను సందర్శించి మొక్కలు నాటారు. బాలిలోని తమన్ హుటాన్ రాయ మడ అడవులను దేశాధినేతలు సందర్శించారు.
ఈ సమయంలో అమెరిక అధ్యక్షుడు మరోసారి ప్రధాని మోదీని కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జో బైడెన్, ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్న ఫోటోను మీడియా ఫోటో తీసింది. జో బైడెన్ సెల్యూల్ కు ప్రతిగా ప్రధాని మోదీ చేతితో అభివాదం చేశారు. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా సందేశం పంపేందుకు ప్రపంచ దేశాల నాయకులు మడ మొక్కలను నాటారు. ఈ మొత్తం కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడిడో అధ్యక్షత వహించారు.
Read Also: Telangana Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. తుది కీ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ముచ్చటించారు. నిన్న జోబైడెన్, నరేంద్ర మోదీలు ఒకరినొకరు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇద్దరి నేతల మధ్య మంగళవారం కీలక చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఇరువురి మధ్య ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుసింది. అయితే మొదటి నుంచి ఈ యుద్దంపై భారత్ తటస్థంగా ఉంటోంది. ఇరు దేశాలు కూడా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. మరోవైపు భారత్ తన అవసరాల కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. దీన్ని పాశ్యాత్య దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
With G-20 leaders at the Mangrove Forest in Bali. @g20org pic.twitter.com/D5L5A1B72e
— Narendra Modi (@narendramodi) November 16, 2022