ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఒక ప్రవాహంలా అశ్లీలత ప్రవహిస్తోంది. జుగుప్సకరమైన దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో రాత్రి, పగలు లేకుండా మొబైల్స్‌లో పోర్న్ వీడియోలు చూసి మృగాలుగా మారిపోతున్నారు. దీంతో ఆడవాళ్ల పట్ల మృగాలుగా ప్రవర్తించి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటారా? పోర్న్ వాచ్‌పై తాజాగా షాకింగ్ రిపోర్టు వచ్చింది.
ఇది కూడా చదవండి: Hoax Bomb Threat: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ఆస్ట్రేలియాలో జరిగిన తాజా సర్వేలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు సెక్స్ గురించి తెలుసుకుంటున్నారని నివేదికలో పేర్కొంది. 16-20 సంవత్సరాల వయసు గల ఆస్ట్రేలియన్లు అశ్లీలతపై మక్కువ చూపిస్తున్నట్లుగా తేలింది. పోర్న్ వీడియోల్లో ఎక్కువ హింసాత్మకంగా ఉన్న వీడియోలు వీక్షిస్తున్నట్లుగా పేర్కొంది. ఆన్‌లైన్ సర్వేలో 832 మంది పాల్గొన్నారు. సెక్స్, డేటింగ్, సంబంధాలపై యువత మొగ్గు చూపుతున్నట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్‌గా భావిస్తున్నట్లుగా స్పష్టమైంది. పోర్న్ వీడియోలు కారణంగా పిల్లల భవిష్యత్ పాడువుతుందని.. ఆడవారి పట్ల చిన్నచూపు కలుగుతుందని పలువురు నిపుణులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ranji Trophy: మెగా వేలానికి ముందు వీర బాదుడు.. ట్రిపుల్ సెంచరీ సాధించిన లోమ్రోర్
యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్ లా స్కూల్, క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం చేసిన సర్వేలో 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు 57 శాతం మంది సెక్స్ సమయంలో ఒక్కసారైనా ఉక్కిరిబిక్కిరి లేదా గొంతు కోసి చంపబడ్డారని తేలింది. సగం కంటే ఎక్కువ మంది భాగస్వామి పట్ల ఇలా చేసినట్టు గుర్తించారు. అశ్లీలతతో ఉక్కిరిబిక్కిరి అవ్వడం.. ప్రమాదాలు ఉన్నప్పటికీ తరచుగా ఆహ్లాదకరంగా భావిస్తున్నట్లు కనుగొన్నట్లు తెలిపింది. ఏకాభిప్రాయంతో కూడిన సెక్స్ నుంచి సమాజం హింసాత్మక సెక్స్‌ను డిఫాల్ట్‌గా మార్చిందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Mohammed Shami: కమ్ బ్యాక్‌లో అదరగొట్టిన షమీ.. ఇది కదా కావాల్సింది