Site icon NTV Telugu

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచ ప్రముఖులు సంతాపం

Popefrancis2

Popefrancis2

పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు.  సోమవారం ఉదయం వాటికన్‌లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం సందేశం కూడా ఇచ్చారు. అలాగే ఆదివారం వాటికన్‌లో పోప్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారు.

ఇక పోప్ ఫ్రాన్సిస్ మరణవార్తను వాటికన్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఫ్రాన్సిస్ అమెరికాలోని  అర్జెంటీనాలో  జన్మించారు. అమెరికా నుంచి వచ్చిన  వ్యక్తి  పోప్ కావడం విశేషం. 12 ఏళ్ల నుంచి పోప్‌గా కొనసాగుతున్నారు. బెన్‌డిక్ట్ XVI రాజీనామా తర్వాత 2013లో ఫ్రాన్సిస్ పోప్ అయ్యారు. దాదాపు 1300 సంవత్సర కాలంలో యూరోపియన్ కాని వ్యక్తి పోప్ కావడం ఇదే తొలిసారి. ఆ అవకాశం అమెరికా పౌరుడిగా ఫ్రాన్సిస్‌కు దక్కింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత ఇబ్బంది పెట్టాయి.

పోప్ ఫ్రాన్సిస్ మరణవార్తపై ప్రపంచ వ్యాప్తంగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల, న్యాయం, సయోధ్య పట్ల ఆయన అవిశ్రాంత నిబద్ధతకు ఫ్రాన్సిస్ చిరస్మరణీయుడని జర్మన్ ఛాన్సలర్ ఇన్ వెయిటింగ్ ఫ్రెడరిక్ మెర్జ్ అన్నారు.

Exit mobile version