Site icon NTV Telugu

Switzerland bar fire: అంతులేని విషాదం.. 47 మంది సజీవదహనం.. 115 మందికి గాయాలు

Switzerland Bar Fire

Switzerland Bar Fire

న్యూఇయర్ వేళ స్విట్జర్లాండ్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఊహించని విపత్తు సంభవించడంతో పెను విషాదం చోటుచేసుకుంది. లగ్జరీ స్కీ రిసార్ట్‌ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 47 మంది చనిపోగా.. 115 మంది గాయాలు పాలైనట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!

నూతన సంవత్సరం వేళ క్రాన్స్-మోంటానాలోని ఆల్పైన్ రిసార్ట్‌లోని వందలాది మంది వినోదంలో మునిగిపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు అందరూ ఒకే దగ్గరకు చేరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని కేకలు, అరుపులతో గడిబిడి జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోయారు. దాదాపు 47 మంది సజీవదహనం అయ్యారు. 115 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.

అయితే పరిమిత స్థలంలో మండే పదార్థాలను అకస్మాత్తుగా మండించడం వల్లే పేలుడు సంభవించిందని.. దీంతో వేగంగా మంటలు వ్యాపించాయని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఫ్లాష్‌ఓవర్ అంటే ఏమిటి?
అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా మండే వస్తువులు అన్నీ ఒకేసారి మండిపోతాయని తెలిపింది. ఇక మంటల్లో గది కాలిపోయిందని ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ కెర్బర్ అన్నారు.

స్విట్జర్లాండ్ అధ్యక్షుడు విచారం
దుర్ఘటనపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంగా అభివర్ణించారు. మృతులకు సంతాపంగా ఐదు రోజులు పాటు జాతీయ సంతాప దినాలుగా స్విట్జర్లాండ్ ప్రకటించింది. మరణించిన వారి జ్ఞాపకార్థంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై జెండాలను సగం వరకు అవనతం చేయాలని సూచించింది.

 

Exit mobile version