Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని బుధవారం అన్నారు.
గతేడాది నవంబర్ లో పంజాబ్ ప్రావిన్సులో నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు తనను చంపేందుకు మరో ప్లాన్ వేశారని ఆయన అన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్ పోలీస్ చీఫ్ లు వారి హ్యాండ్లర్లు జమాన్ పార్క్ నివాసంలో మరో ఆపరేషన్ ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు.
Read Also: Girl Friend On Rent: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. చైనా యువకుల కొత్త ప్లాన్
ప్లాన్ ఏమిటంటే.. జమాన్ పార్క్ వద్ద రేపు లేదా తర్వాతి రోజు మరో ఆపరేషన్ ఉందని, వారి మనుషులు ప్రజల్లో కలిసిపోయేలా రెండు స్వ్కాడ్ లను తయారు చేశారు. ఆపై నలుగురైదుగురు పోలీస్ అధికారులను కాల్చి చంపుతారు, ఆ తరువాత జరిగే కాల్పుల్లో తన పార్టీ కార్యకర్తలను చంపేస్తారని, గతంలో ముర్తాజా భుట్లో హత్య తరహాలోనే నన్ను చంపేస్తారని ఆయన ఆరోపించారు. 1996 కరాచీ పోలీస్ ఎన్ కౌంటర్ లో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో సోదరుడు ముర్తాజాను చంపేశారు. ఆ సమయంలో ప్రధానిగా బెనజీర్ భుట్టోనే ఉన్నారు. ఈ ఘటన జరిగిన 11 ఏళ్ల తర్వాత 2007 రావల్పిండి ఎన్నికల ర్యాలీలో ఉగ్రవాదుల దాడిలో ఆమెను హతమార్చారు.
పోలీసులు ఏం చేసినా రెచ్చిపోవద్దని కార్యకర్తలకు ఇమ్రాన్ ఖాన్ దిశానిర్దేశం చేశారు. సంయమనం పాటించాలని కోరారు. నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కానీ రక్తపాతం మాత్రం వద్దు అని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇస్లామాబాద్ కోర్టులో హాజరుపరిచే సందర్భంలో తనను డెత్ ట్రాప్ చేశారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు నన్ను చంపేందుకు వచ్చారని ఆయన ఆరోపించారు.