Best PM in the World: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాధినేతల్లో మళ్లీ నంబర్ వన్‌గా నిలిచారు. భారత ప్రధాని మోడీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది. ఈ సర్వేలో ప్రధాని మోడీకి 75 శాతం రేటింగ్ రావడం విశేషం. మోడీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ రెండో స్థానంలో నిలిచారు. ఓబ్రడార్ కు 63 శాతం రేటింగ్ లభించింది. ఇక, 54 శాతం రేటింగ్‌తో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్‌తో 5వ స్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.
Pizza delivery man shot: చిరిగిన నోటును తీసుకోనందుకు పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు
మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన జాబితాలో మొత్తం 22 మంది ప్రపంచ నేతలు ఉన్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. అల్‌ఖైదా అధినేత అల్ జవహరిని ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ ద్వారా హతమార్చిన నేపథ్యంలో ఆయన రేటింగ్స్ పెరుగుతాయని అంచనావేశారు. అయినా కూడా పెద్దగా మార్పేమీ రాకపోవడం గమనార్హం.
