Site icon NTV Telugu

PM Modi: గయానాలో ప్రధాని మోడీ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

Modipm

Modipm

ప్రధాని మోడీ గయానాలో పర్యటిస్తున్నారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీకి విమానాశ్రయంలో రాష్ట్రపతి ఇర్ఫాన్ అలీ, ప్రధానమంత్రి మార్క్ ఆంథోనీ ఫిలిప్స్, సీనియర్ మంత్రులు, ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని మోడీ గయానా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీతో మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనంతరం గయానా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అలాగే భారతీయులను కూడా కలిసి ముచ్చటించనున్నారు.

ఇది కూడా చదవండి: Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య, చరణ్ సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి!

మూడు దేశాల పర్యటన కోసం నవంబర్ 16న నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలకు ప్రధాని మోడీ బయల్దేరి వెళ్లారు. తొలుత నైజీరియాలో మోడీ పర్యటించారు. అనంతరం అక్కడ నుంచి జీ 20 సదస్సుకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఆయా దేశాధినేతలతో మోడీ సమావేశం అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై చర్చించారు. ప్రస్తుతం మోడీ గయానాలో పర్యటిస్తున్నారు. బుధ, గురువారాల్లో గయానాలో పర్యటించనున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించటం ఇదే తొలిసారి. పర్యటన అనంతరం భారత్‌కు బయల్దేరి రానున్నారు.

ఇది కూడా చదవండి: Ukraine-US: ఉక్రెయిన్‌లో టెన్షన్ వాతావరణం.. యూఎస్ ఎంబసీ మూసివేత

 

 

 

Exit mobile version