Site icon NTV Telugu

India- US Tariff War: ఉక్రెయిన్పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నాడు.. ఆపేస్తే టారీఫ్స్ తగ్గిస్తాం!

Us

Us

భారత్ పై అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో మరోసారి నోరు పరేసుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎవరి నుంచైనా ఆయిల్ కొంటామని ఇండియన్స్ అహంకారంతో మాట్లాడటం నాకు నచ్చడం లేదు.. భారత్ వల్ల అమెరికన్స్ అందరూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే వెంటనే 25 శాతం టారీఫ్స్ తగ్గిస్తామని అమెరికా వైట్‌హౌస్‌ ట్రేడ్‌ సలహాదారు పీటర్‌ నవారో వ్యాఖ్యనించాడు.

Read Also: Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..

అయితే, రష్యా చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఎక్కువగా కొనసాగిస్తుందని అమెరికా వైట్‌హౌస్‌ ట్రేడ్‌ సలహాదారు పీటర్‌ నవార్ పేర్కొన్నారు. దీని వల్ల కీవ్‌ తరచూ అమెరికా వద్ద నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం కోరుతోంది.. భారత్‌ చేసే ఈ చర్యల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఉద్యోగాలు, కర్మాగారాలు, వేతనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు.. భారత్‌ ఒక పరిపక్వ ప్రజాస్వామ్యం.. కానీ, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి మోడీ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. శాంతి మార్గం అని న్యూఢిల్లీ చెబుతుంది.. కానీ, వాళ్లు చేసే వ్యాపారం మాత్రం యుద్ధాన్ని పెంచేలా ఉందన్నారు. అందుకే నేను దీన్ని ‘మోడీ యుద్ధం’ అని పిలుస్తున్నాను అని నవర్రో అన్నారు.

Exit mobile version