Site icon NTV Telugu

PM Modi: భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ

Modi

Modi

భూటాన్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. చాంగ్లిమితాంగ్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ స్టేడియంలో కలియ తిరిగి అందరికీ నమస్కరించారు.

అనంతరం మోడీ మాట్లాడుతూ.. భారతదేశం-భూటాన్ మధ్య శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక, సాంస్కతిక బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూటాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలో.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని మోడీ కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటంపై దృష్టి పెడతామని చెప్పారు. అంతకముందు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చ జరిగింది.

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ మంగళవారం ఉదయం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. బుధవారం తిరిగి భారత్‌కు రానున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీ బ్లాస్ట్‌పై స్పందిస్తూ.. తన మనసు కలిసి వేసిందని.. చాలా భారంతో భూటాన్ వచ్చినట్లుగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: సీసీటీవీలో రికార్డైన ఢిల్లీ బ్లాస్ట్ దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్

Exit mobile version