జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని భారత్‌ను ఖండించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “నా ప్రియ మిత్రుడు షింజో అబేపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. తామంతా అతని కుటుంబంతో..జపాన్ ప్రజలతో ఉన్నామంటూ..” ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. షింజో అబేకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేల మధయ మంచి స్నేహం కూడా ఉంది. షింజో అబే జపాన్ ప్రధానమంత్రిగా భారతదేశానికి వచ్చినప్పుడు వారణాసి దర్శనానికి ప్రధాని మోదీ తీసుకెళ్లారు. ఇద్దరు దేశాధినేతలు కలిసి గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సమయంలో భారతీయ సంస్కృతి, నాగరికత పట్ల షింజో అబే తన ఆప్యాయతను వెల్లడించారు. షింజో అబే భారతీయ సంప్రదాయాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనకు ప్రియమైన మిత్రుల్లో భారత ప్రధాని మోదీ ఒకరు అంటూ గతంలో జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ప్రధాని మోదీ షింజో అబేకు భగవద్గీతను కూడా అందించారు.
Big Breaking: దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం
జపాన్‌లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును షింజో అబే సొంతం చేసుకున్నారు. 2006లో ఏడాది పాటు అబే ఏడాది పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2012 నుంచి 2020 వరకు కూడా ఆయన ఈ పదవిలో ఉన్నారు. జపాన్ ప్రధానమంత్రి పదవికి షింజో అబే 2020 ఆగస్టు 28న రాజీనామా చేశారు. కొన్ని సంవత్సరాలుగా అబే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన అనారోగ్యం ప్రభుత్వానికి సమస్యలు సృష్టించొద్దనే కారణంతోనే ఆయన రాజీనామా చేశారు. అల్సరేటివ్ కొలిటిస్ అనే వ్యాధితో కొన్నేళ్లుగా ఆయన పోరాడుతున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డు 2022ను ప్రకటించింది . ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా నగరంలో షింజో అబే ప్రచారం చేస్తున్న సమయంలో దుండుగుడు కాల్పులకు దిగాడు. జపాన్‌లో తుపాకులపై నిషేధం కూడా ఉంది. అయినా మాజీ ప్రధానిపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.
