NTV Telugu Site icon

Tokyo-Haneda airport: ఎయిర్‌పోర్టులో ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ 379 మంది..

Tokyo Haneda Airport

Tokyo Haneda Airport

Tokyo-Haneda airport: జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తర్వాత 367 మంది ప్రయాణికులను, 12 మంది సిబ్బందిని ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా తరలించారు.

Read Also: Hit-And-Run Law: కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్ పంపుల వద్ద రద్దీ..

ప్రయాణికుల విమానం అత్యంత వేగంగా రన్ వేపై వెళ్తూ మంటల్లో చిక్కుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) ఎయిర్‌బస్ A350 విమానాన్ని కోర్టు గార్డ్ విమానం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మంటలు అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516లో 12 మంది సిబ్బందితో సహా 379 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వీరిని హుటాహుటిన రెస్క్యూ చేశారు. MA722 ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌‌ని ఢీకొట్టడంపై దర్యాప్తు చేస్తున్నట్లు జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. తమ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించామని కోస్ట్ గార్డ్ చెప్పారు. ప్రమాదానికి గురైన జపాన్ ఎయిర్‌లైన్స్ 516 ఎయిర్ బస్ A-350 ప్యాసింజర్ జెట్ జపాన్ లోని షిన్ చిటోస్ నుంచి టోక్యోలోని అత్యంత రద్దీగా ఉండే హనెడాకు వెళ్లినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రమాదం కారణంగా హనేడా విమానాశ్రయం అన్ని రన్ వేలపై కార్యకలాపాలను నిలిపేసింది.

Show comments