Site icon NTV Telugu

Plane Crash Video: ఫ్లోరిడా హైవేపై ఎమర్జెన్సీ ల్యాండైన విమానం.. కారును ఢీకొట్టి ఆగిన ఫ్లైట్

Plane Crash

Plane Crash

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హైవేపై కార్లు దూసుకెళ్లిపోతుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళంగా నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డిసెంబర్ 8న సోమవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో రహదారిపై విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒక కారును ఢీకొట్టి ఆగిపోయింది. విమానం ముందుకు జారి ఆగిపోయింది. అయితే విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పైలట్‌తో పాటు ఒక ప్రయాణికుడు ఉన్నారు. ఇద్దరిలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అయితే కారులో ఉన్న 57 ఏళ్ల మహిళకు మాత్రం స్వల్పగాయాలు అయినట్లుగా సమాచారం. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది..ఏ సమస్య తలెత్తిందో మాత్రం వివరాలు వెల్లడించలేదు.

 

Exit mobile version