NTV Telugu Site icon

Thailand: థాయ్‌లాండ్‌లో కూలిన విమానం.. తెలియని ప్రయాణికుల జాడ!

Planecrash

Planecrash

థాయ్‌లాండ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. థాయ్‌లాండ్‌లోని చాచోంగ్‌సావోలోని అడవిలో కూలిపోయింది. విమానంలో ఏడుగురు టూరిస్టులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. విమానం బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి ట్రాట్ ప్రావిన్స్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూాడా చదవండి: Jyothi Rai: తుంటరి చూపుతో.. చుట్టమల్లే చుట్టేస్తోన్న జగతి ఆంటీ.. ఫొటోస్ చూశారా..

థాయ్‌లాండ్‌లోని తూర్పు ప్రావిన్స్‌లోని చాచోంగ్‌సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయల్దేరింది. అయితే ఈ విమానం కూలిపోయినట్లు సమాచారం అందడంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. పర్యాటకులు జాడ కోసం వెతుకుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. Cessna Caravan C208 విమానం. థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ ఫ్లైట్ నంబర్ TFT 209. రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌తో సంబంధాన్ని కోల్పోయింది. ఆగ్నేయ ట్రాట్ ప్రావిన్స్‌కు వెళుతుండగా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:18 గంటలకు కూలిపోయింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఇది కూాడా చదవండి: Smart Phones: బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. రూ. 25 వేల లోపు బెస్ట్ ఇవే..!