Physical violence against a woman every two hours in Pakistan: ప్రపంచ వేదికలపై నీతులు చెప్పే పాకిస్తాన్ తన దేశంలో జరుగుతున్న దారుణాలను మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ మైనారిటీలు నిత్యం హింసకు గురవుతున్నారు. హిందూ బాలికలు, మహిళలు కిడ్నాపులకు గురవుతున్నారు. బాలికను కిడ్నాప్ చేస్తూ బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో ప్రతీ రెండు గంటలకు ఒక అత్యాచారం జరుగుతోంది. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేది మాత్రం 0.2 శాతాని కన్నా తక్కువగా ఉంది. అంటే అక్కడ అత్యాచార బాధితులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో అర్థం అవుతోంది. పాకిస్తాన్ లో పరువు హత్యలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.
Read Also: Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ పని చేస్తే మెంబర్షిప్ రద్దు చేస్తాం
2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా 305 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. పాకిస్తాన్ మానవహక్కుల మంత్రిత్వశాఖ గణాంకాల ఆధారంగా ఛానెల్ సమా న్యూస్ నిర్వహించిన సర్వేలో విస్తూపోయే నిజాలు వెల్లడయ్యాయి. 2017 నుంచి 2021 వరకు దేశంలో మొత్తం 21,900 మంది మహిళలపై అత్యాచారాలు నమోదు అయ్యాయి. అంటే ప్రతీ రోజు 12 మందిపై లేదా ప్రతీ రెండు గంటలకు ఇద్దరు మహిళలపై అత్యాచారం జరుగుతోందని తేలింది. వీటిల్లో చాలా అత్యాచార కేసులు వెలుగులోకి రావడం లేదని.. పరువు, ప్రతీకారదాడులు ఎదుర్కొంటామనే భయంతో చాలా మంది మహిళలు తమపై జరిగిన అన్యాయాన్ని అధికారులకు చెప్పడం లేదని సర్వే పేర్కొంది.
2022లో పాకిస్తనా్ లోని 44 కోర్టుల్లో మహిళలపై లైంగిక హింసకు సంబంధించి 1301 కేసులు విచారణకు వచ్చాయి. పోలీసులు 2856 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తే కేవలం ఇందులో 4 శాతం కేసులు మాత్రమే విచారణకు వెళ్లాయి. ఇందులో 0.2 శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడ్డాయి. లింగసమానత్వంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 146 దేశాల్లో 145వ స్థానంలో ఉంది పాకిస్తాన్. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇక పాకిస్తాన్ వ్యాప్తంగా పరువు హత్యలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో 1957 పరువు హత్యలు నమోదు అయ్యాయి.
