Site icon NTV Telugu

5-11 ఏళ్లలోపు చిన్నారులకు ఫైజర్ టీకా సురక్షితం !

Pfizer

5-11 ఏళ్ళ లోపు చిన్న పిల్లలకు తమ టీకా సురక్షితమని ప్రకటించింది ఫైజర్. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి అని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్న చిన్నారులలో యాంటీబాడీస్ ప్రతిస్పందన కనిపిస్తోందని తెలిపింది ఫైజర్. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి ఫైజర్ మరియు బయోఎన్ టెక్ సంస్థలు. క్లినికల్ ట్రయల్స్ లో సమర్థంగా పని చేస్తున్నట్లు నిర్ధారించాయి ఈ రెండు సంస్థలు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 5- 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 2వేల 268 మంది చిన్నారులకు రెండు డోసుల టీకా ఇచ్చారు. 12 ఏళ్లు దాటినవారికి ఇస్తున్న మోతాదుతో పోల్చితే కొంత తక్కువ ఇచ్చారు. ఈ క్రమంలో వారిలో టీకా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలిందని చెప్పారు నిపుణులు. పెద్ద మొత్తంలో యాంటీబాడీలనూ ఉత్పత్తి చేసిందన్నారు ఫైజర్ సీఈవో.

Exit mobile version