NTV Telugu Site icon

అన్ని వేరియంట్ల‌కు ఒక‌టే మెడిసిన్‌…

క‌రోనా కేసులు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనాకు కార‌ణ‌మైన సార్స్ కోవ్ 2 వైర‌స్ అనేక మ్యూటెంట్లుగా మార్పులు చెంది ప్ర‌జ‌ల ప్రాణాలు హ‌రింస్తోంది.  క‌రోనా మ‌హమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్ప‌టికే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.  అయితే, సార్స్ కోవ్ 2 వైర‌స్‌లో ఉత్ప‌రివ‌ర్త‌నాలు వేగంగా మార్పులు జ‌రుగుతుండ‌టంతో అన్నిర‌కాల వేరియంట్ల‌ను త‌ట్టుకొని నిల‌బ‌డ‌టం కోసం మెడిసిన్‌ను రెడీ చేస్తున్న‌ట్టు అమెరికాలోని పెన్సిల్వేనియా శాస్త్ర‌వేత్త‌లు పేర్కోన్నారు.  క‌రోనాను క‌ట్టడి చేయ‌డానికి యాంటివైర‌ల్‌ను అభివృద్ది చేయ‌డం అత్య‌వ‌స‌రంగా మారింద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కోన్నారు.  సార్స్ కోవ్ 2 వైర‌స్ శ్వాస‌కోశంలోని ఎపిథీలియ‌ల్ క‌ణాల‌పై దాడిచేస్తుంది.  ఈ స‌మ‌యంలో రోగ‌నిరోధ‌క శక్తి వైర‌స్‌ను అడ్డుకోవాలి.  కానీ, రోగ‌నిరోధ‌క శ‌క్తికి క‌న‌బ‌డ‌కుండా వైర‌స్ క‌ణాల‌పై దాడిచేస్తున్న‌ది.  దీనిని అడ్డుకునేందుకు క‌ణాల్లోని సెన్సింగ్ వ్వ‌వ‌స్థ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని 75 ర‌కాల ఔష‌దాల‌తో ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.  అయితే, వైర‌స్‌ను అడ్డుకొనే 9 రకాల ఔష‌దాల‌ను గుర్తించామని, అందులో క్యాన్స‌ర్ కు వినియోగించే డిఐఏబీజెడ్ఐ అనే మందు వేరియంట్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా అడ్డుకోవ‌డానికి స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం ఎలుక‌ల‌పై ప్ర‌యోగాలు చేస్తున్నామ‌ని, విజ‌య‌వంత‌మైతే అన్నిరాకాల వేరియంట్ల‌ను ఎదుర్కోవ‌డానికి ఒక‌టే మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని పెన్సిల్వేనియా శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.