NTV Telugu Site icon

USA: ప్రియురాలితో గొడవపడి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి..

Usa

Usa

USA: విమానంలో ప్రియురాలిలో గొడవ, ఇతర ప్రయాణికులకు ప్రమాదంగా మారింది. అమెరికాలోని బోలోని లోగాన్ విమానాశ్రయంలో విమానం టాక్సీ వేలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. బెట్‌బ్లూ విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని ప్యూర్టోరికన్ ప్రయాణికుడిగా గుర్తించారు. తన ప్రియురాలిలో వాగ్వాదం తర్వాత విమానం నుంచి దూకేందుకు అతను ప్రయత్నించాడు.

Read Also: ZEE Telugu: సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు వచ్చేస్తున్న జీ తెలుగు..

మోరల్స్ టోర్రెస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. విమానం ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌కి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. టొర్రెస్ తన ప్రియురాలితో విమానంలో గొడవపడ్డాడు. విమానం ఎమర్జెన్సీ డోర్‌ని అకాస్మత్తుగా తెరిచాడు. అయితే, పరిస్థితి చేజారేలోపే ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు. మసాచుసెట్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

టొర్రెస్ తల్లిదండ్రులు అతడికి బెయిల్ దాఖలు చేశారు. భవిష్యత్తులో కోర్టులో హాజరు కోసం మసాచుసెట్స్‌కి తప్ప మిగతా ప్రాంతాలకు ప్రయాణించకూడదని, తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కోర్టు ఆదేశించినట్లు న్యాయవావా రాబర్ట్ కార్మెల్ మోంటెస్ తెలిపారు. ఇది క్రిమినల్ సమస్య కన్నా మానసిక సమస్యగా చూస్తున్నానని కార్మెల్ అన్నారు.

Show comments