Site icon NTV Telugu

Flight Accident: ట్రక్కును ఢీకొన్న విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Peru Flight Accident

Peru Flight Accident

passenger jet collides with truck on runway in Peru: లాటిన్ అమెరికా దేశం పెరూలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం రన్ వే పైన ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విమానాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. పెరూ రాజధాని లిమా లోని జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: Anurag Thakur: “తుక్డే తుక్డే గ్యాంగ్‌”తో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడు.

అయితే ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్ బస్ ఏ320నియో విమానం 102 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో టేకాఫ్ తీసుకుంటుండగా రన్ వేపై ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయం అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రమాదానికి గురైన విమానం లిమా నుంచి దక్షిణ పెరువియన్ నగరమైన జూలియాకాకు బయలుదేరింది. పెరూ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో చనిపోయిన వ్యక్తులకు నివాళులుల అర్పించారు. ట్రక్కును ఢీకొన్న తరువాత విమానం మంటలతోనే రన్ వేపై ప్రయాణించింది. విమానం కుడి భాగం పూర్తిగా ధ్వంసం అయింది. వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది విమానానికి అంటుకున్న మంటలను ఆర్పేసి, ప్రయాణికులను విమానం నుంచి రెస్క్యూ చేశారు.

Exit mobile version