ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయినప్పటికీ ఉత్తర భాగంలో ఉన్న పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం తాలిబన్లు పోరాటం చేస్తున్నారు. నిన్నటి రోజున జరిగిన పోరాటంలో 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ ఫైటర్స్ పేర్కొన్నారు. పంజ్‌షీర్ ఫైటర్స్‌కు మాజీ ముజాహిదీన్ నేత అహ్మద్ షా కుమారుడితో పాటు, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయత్వం వహిస్తున్నారు. ఆఫ్ఘన్ రద్దుచేసిన సాయుధ సిబ్బందితో పాటుగా, స్థానికి మిలీషియా దళంతో కలిసి తాలిబన్లపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు ఘనీ దేశం విడిచి వెళ్లిపోవడంతో, అమ్రుల్లా సలేహ్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తాలిబన్లను తరిమి కొడతామని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే అనేకమంది ఆఫ్ఘన్ సైనికులు కూడా వీరితో చేతులు కలిపారు. ఒక్క పంజ్‌షీర్ ప్రాంతం మినహా అన్ని ప్రాంతాలు తాలిబన్ల వశం అయ్యాయి. ఒకవైపు ఈ పంజ్‌షీర్ ఫైటర్స్ తాలిబన్లతో పోరాటం చేస్తూనే మరోవైపు పర్వత ప్రాంతాల్లో ఆటవిడుపు కోసం వాలీబాల్ గేమ్ అడుతున్నారు. ఫైటర్స్‌తో పాటు అమ్రుల్లా సలేహ్ కూడా వాలీబాల్ అడుతుండటం విశేషం. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read: దారుణం: అందరూ మెచ్చుకోవాలని పాములకు రాఖీ కట్టాడు… చివరకు…
