Pakistan: “పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో ఉంది”.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..
- పాకిస్తాన్‌కి వణుకు పుట్టిస్తున్న బీఎల్ఏ, తాలిబన్లు..
- వరస దాడులతో దద్దరిల్లుతున్న దాయాది దేశం..
- పాక్ ఉనికి ప్రమాదంలో ఉందన్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు. ఇటీవల, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుని హైజాక్ చేసి, 200 కి పైగా ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ సిబ్బందిని బీఎల్ఏ హతమార్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే బలూచ్ ప్రావిన్సులోని నోష్కి ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడిచేసి 90 మందిని హతమార్చింది. మరోవైపు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. సింధ్ ప్రాంతంలో కూడా సింధుస్తాన్, సింధుదేశ్ వంటి ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు వస్తున్నాయి. పీఓకే ప్రాంత ప్రజలు భారత్‌లో కలుస్తామని ఉద్యమిస్తున్నారు.
Read Also: Vizag and Vijayawada Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గుడ్‌న్యూస్..
Also Read
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఎల్ఏ చేతిలో చావుదెబ్బలు తిన్న తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ని ‘‘స్ట్రిక్ట్’’గా మార్చాలని చెప్పారు. దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, ఉగ్రవాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అని చెప్పారు. జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలనను మెరుగుపరచాలని ఆయన ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను కోరారు. పాకిస్తాన్ స్ట్రిక్ట్‌గా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన చెప్పారు. పాలనలో అంతరాల వల్ల పాకిస్తాన్ సైన్యం, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంత కాలం అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!