Pakistanis fill cooking gas in plastic balloons: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రానురాను దిగజారుతోంది. మరో శ్రీలంకలా మారేందుకు మరెన్నో రోజులు పట్టకపోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భణం కారణంగా అక్కడ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో కోతలు కూడా విధించింది పాక్ సర్కార్. ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తోంది.
Read Also: Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. చివరు వంట గ్యాస్ ను బెలూన్లలో నింపుతున్నారు. ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్సులోని ప్రజలు సిలిండర్ల కొరత కారనంగా ఇలాగే ప్లాస్టిక్ సంచుల్లోనే గ్యాసును తీసుకెళ్లాల్సిన పరస్థితి ఏర్పడింది. చివరికి అక్కడి ప్రభుత్వం ప్రజలు కనీస అవసరాలను తీర్చే పరిస్థితుల్లో లేదు. తమ పౌరులకు ఎల్పీజీ అవసరాలను తీర్చలేకపోతోంది.
కంప్రెషర్ల సహాయంతో గ్యాస్ విక్రేతలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఎల్పీజీని నింపి, బ్యాగు ముక్కు వద్ద వాల్వ్ ను గట్టిగా మూసేస్తున్నారు. ప్లాస్టిక్ సంచిలో మూడు నుంచి నాలుగు కిలోల గ్యాస్ నింపడానికి సుమారు గంట సమయం పడుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో గ్యాస్ సిలిండర్ల ధర రూ. 10,000 పాకిస్తానీ రూపాయలుగా ఉంది. అయితే ఇంత ధరపెట్టి గ్యాస్ కొనలేని పాక్తిస్తానీయులు ప్లాస్టిక్ సంచుల్లో రూ.500-900 వరకు గ్యాస్ కు వెచ్చిస్తున్నారు. అయితే ఇలా బ్యాగులో గ్యాస్ తీసుకెళ్లడం ఓ బాంబును పక్కన పెట్టుకోవడమే అని చెబుతున్నారు నిపుణులు. పాకిస్తాన్ లో ఈ ప్లాస్టిక్ సంచుల వల్ల ప్రమాదాలు జరిగి ఇప్పటికే 8 మంది గాయాలు పాలయ్యారు.