దామాది దేశం పాకిస్థాన్ అగ్ర రాజ్యాలతో బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా, చైనా సహా పలు దేశాలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని ప్రణాళిక వేస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఖనిజ నిల్వలను ఉపయోగించుకోవాలని అమెరికా, చైనాలను ఆహ్వానించాలని పాకిస్థాన్ యోచిస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Congress vs BJP: ఇటలీ పౌరురాలికి ఓటు ఎలా వచ్చింది.. సోనియాగాంధీపై బీజేపీ ఎదురుదాడి
పాకిస్థాన్‌లో భారీగా ఖనిజ నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 ట్రిలియన్ల వరకు అమెరికా, చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, టర్కీ, యూఏఈ వంటి దేశాల నుంచి పెట్టుబడులను పొందడానికి పాకిస్థాన్ ప్లాన్ చేస్తు్న్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Indo-Pak border: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. జవాన్ వీరమరణం
వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో ఎలక్ట్రానిక్స్, రక్షణ సాంకేతికతకు సంబంధించిన కీలకమైన అరుదైన ఖనిజ నిక్షేపాలను అమెరికా అధికారులు గుర్తించారు. ఇక ఏప్రిల్‌లో జరిగిన పాకిస్థాన్ మినరల్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌కు కూడా అమెరికా అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉత్తర బలూచిస్థాన్, దక్షిణ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మైనింగ్ ప్రాజెక్టులను పొందుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో అన్వేషణ హక్కులను చైనాకు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తర పాకిస్థాన్‌లో దక్షిణాన లోతైన సముద్ర ఓడరేవుతో అనుసంధానించే 2,000 మైళ్ల రవాణా ప్రాజెక్టును కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఒప్పందాలను రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఖరారు చేయాలని యోచిస్తోంది.
అన్ని అగ్ర బిడ్డర్లకు వసతి కల్పిస్తామని పాకిస్థాన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పెట్టుబడిదారులకు సమర్థవంతమైన వన్-విండో ఆపరేషన్‌ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదికలు అందుతున్నాయి. బొగ్గు, రాగి, బంగారం, ఇనుప ఖనిజం, క్రోమైట్, విలువైన రాళ్ళు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు నిల్వలు, అలాగే ఐదవ అతిపెద్ద రాగి, బంగారు నిక్షేపాలతో సహా ఖనిజ వనరులను పాకిస్థాన్ కలిగి ఉంది. ఈ వనరులు బలూచిస్థాన్ భూభాగం నుంచి పర్వత ఉత్తరం, పంజాబ్, సింధ్ మైదానాల వరకు అన్ని ప్రావిన్సులలో విస్తరించి ఉన్నాయి.
ఇక పాకిస్థాన్ ఇంధన రంగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. చమురు నిల్వలను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి అమెరికా ఒక భాగస్వామ్యాన్ని ఖరారు చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో ఇప్పుడే ఒక ఒప్పందాన్ని చేసుకున్నామని.. దీంతో పాకిస్థాన్, అమెరికా భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయని ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు.
